03/09/2020
_డియర్ ఫ్రెండ్స్, *
ఇది మీరు చదివి ఇన్సూరెన్స్ గురించి అవగాహన తెచ్చుకోండి, తెలియచెేయండిి.*_
1). కొడుకు\కూతురు చదువు మరియు పెళ్ళి కొరకు బంగారం కొంటారు.. కానీ బంగారం లాంటి పిల్లల పాలసీ మాత్రం కొనరు చాలా మంది.
2). జీవిత భీమా ఏజెంట్ ను చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ.
3). జనాభా 130 కోట్లు మందిలో కేవలమంటే కేవలం 20 కోట్ల మందికి మాత్రమే ఇన్సూరెన్సు పాలసీలు ఉన్నాయి.
4). పది వేల రూపాయల ఫోన్ కు స్క్రీన్ గార్డ్ వాడతారు, కానీ పది కోట్ల రూపాయల విలువ చేసే *జీవితానికి* మాత్రం జీవిత భీమా తీసుకోరు, చేసుకోరు.
5). అస్సలు పరిచయం లేని వ్యక్తి కి ఆడపిల్ల ను ఇచ్చి పెళ్లి చేస్తారు.. కానీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి పాలసీ గురించి చెబితే ఆలోచిస్తాం అంటారు..!
6). గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అని కొట్టుకు చచ్చే వాళ్లలో ఒక్కడు కూడా చివరికి మనిషి *విధి రాత* *మరణం* అని గ్రహించరు.
7). కాళ్ళకి వేసుకునే సెకండ్ హ్యాండ్ చెప్పులు అరగంట కోసం చెప్పుల స్టాండ్లో 5 రూపాయలు (ప్రీమియం కట్టి) పెట్టి ఇన్సురెన్సు చేస్తారు..
కానీ వెలకట్టలేని నీ జీవితాన్ని రోజుకు కనీసం 50/-రూపాయలతోనైనా ఇన్సూరెన్సు చేయకూడదా ..?
*సెకండ్ హ్యాండ్ చెప్పుల కంటే తక్కువైందా నీ జీవితం...???*
8). మేజిక్ ని చేసే బాబాని నమ్ముతారు కానీ లాజిక్ తో
లెక్కలు చెప్పే ఇన్సూరెన్సు ఏజెంట్ ని మాత్రం నమ్మరు.
9). పెన్షన్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ని చూసి నోరు వెళ్ళ బెడతారు. కాని నెలకు కొంత మొత్తాన్ని ఇన్సు రెన్సు కంపెనీ లో దాచుకుంటే జీవితాంతం పెన్షన్ వస్తుందని తెలిసినా దాచుకోవడానికి టెన్షన్ పడుతుంటారు.
10). ఈరోజు ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం నిన్న రాత్రి అలారం పెట్టుకుని ఈరోజు నిద్రలేవని వారు కనీసం 10 వేల మంది. ఫైర్ ఇంజిన్ అలారం తో వస్తుంది.. *డెత్* ఇంజిన్ అలారం పెట్టినా నిన్ను నిద్ర లేపదు. అది తెలుసుకో.
11). ఇంట్లో కరెంటు పోతే కాంతి పోతుంది..అందుకే ఖర్చు పెట్టి *ఇన్వెర్టర్* పెట్టించుకుంటారు.
అలాగే మీ కుటుంబం లో కాంతి ఉండడానికి కారణం *మీరు*., మీరు ఉన్నా లేకపోయినా మీ కుటుంబానికి చీకటి ఉండకూడదు అని మీరు కొనే మరొక ఇన్వర్టరే *ఇన్సూరెన్స్*
12). మనకు చివరి రోజు వచ్చినా మన కుటుంబానికి మాత్రమే అది ఇంకొక రోజు, మరణించిన మరు క్షణం ధీమా, *రక్షణ కవచమే జీవిత భీమా.*
13). వెలుగుతున్న కొవ్వొత్తి తన స్థానం లో కాకూండా చుట్టూ కొంత దూరం కాంతి తో బావుంటుంది.. మనము కరిగి పోయిన తర్వాత.. *కుటుంబం లో కాంతి* కావాలి అంటే *జీవిత భీమా* అవసరం.
14). మీ సెల్ ఫోన్ కార్డు లో బాలన్స్ ఎంత ఉందో మీరు చెబుతారు.. మీ 🏧 Card లో బాలన్స్ ఎంత ఉందో మీరు చెబుతారు. మీ లైఫ్ కార్డు లో ఎన్ని రోజులు బాలన్స్ ఉందో చెప్పగలరా...?, లేదు కదా..!
*అందుకే ఇన్సూరెన్సు పాలసీతో రీఛార్జి అవ్వండి., మీ కుటుంబానికి ధీమా కల్పించండి*
ఇట్లు,
_......మీ శ్రేయోభిలాషిని...._